Tuesday, 17 March 2015

శ్రీమంతుడు

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 21న ఉగాది సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయనున్నారు. అయితే.. ఈ చిత్రంలో టైటిల్‌కు తగినట్లే మహేష్ బాబు.. ప్లేబాయ్‌గా కన్పించనున్నాడు. బాగా రిచ్‌.. జల్సాలే ఆయన డ్యూటీ. అటువంటి వ్యక్తి.. ఇంటర్‌వెల్‌లో ట్విస్ట్‌ ఇస్తాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో జరిగిన సంఘటన కుటుంబపై ఎలా పడింది? అనేది ఆసక్తికరమని తెలుస్తోంది. ఇక సెకండాఫ్‌లో అందరికీ నచ్చేవిధంగా ముఖ్యంగా లేడీస్‌ సెంటిమెంట్‌తో బాగా ఆకట్టుకుంటాడని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఏదిఏమైనా… మహేష్ అభిమానులు కోరుకున్నట్లు చిత్రం వుంటుందని కొరటాల శివ ఫ్యాన్స్‌ కు హామీ ఇచ్చాడు. కాగా, ఇటువంటి క్యారెక్టర్‌ను గతంలో అక్కినేని పోషించారని వార్తలు విన్పిస్తున్నా.. దానికి దీనికి పొంతనే లేదని తెలుస్తోంది.

No comments:

Post a Comment